వైకాపా వంద రోజుల పాలన అధ్వానంగా ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ నాయుడు విమర్శించారు. పాదయాత్రలో ముద్దులు... ఇప్పుడు రద్దులు అనే రీతిలో వైకాపా పాలన సాగుతోందని విమర్శించారు. పశువులు కూడా తినలేని బూజుపట్టిన బియ్యాన్ని.. నాణ్యమైన బియ్యం పేరుతో శ్రీకాకుళంలో సరఫరా చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. సంచులపై పెట్టిన శ్రద్ధ బియ్యంపై పెట్టలేదని మండిపడ్డారు. అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక కమిషన్ల పేరిట మైనారిటీలు, దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సన్న బియ్యం ఇస్తామని.. బూజు పట్టింది ఇచ్చారు: జవహర్ - జవహర్ నాయుడు
వంద రోజుల పాలనలో వైకాపా విఫలమైందని... మాజీ మంత్రి జవహర్ నాయుడు విమర్శించారు. సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బూజుపట్టిన బియ్యం ఇచ్చారన్నారు. బియ్యం సంచిపై పెట్టిన శ్రద్ధ... నాణ్యతపై పెడితే బాగుండేదన్నారు.
jawahar