జగన్ మొండిగా రాజధానిని మార్చాలనుకుంటే తొలి ప్రాధాన్యం రాయలసీమకే ఇవ్వాలని మాజీ మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేశారు. వెనకబడిన రాయలసీమను కాదని విశాఖకు రాజధాని తరలించటం జగన్ సొంత అజెండా అని మండిపడ్డారు. విశాఖలో ప్రమాదం జరిగి చనిపోతే కోటి రూపాయలు ప్రకటించిన జగన్.. సీమ ప్రాంతంలో ఎవరు చనిపోయినా కనీసం పలకరించటం లేదని దుయ్యబట్టారు.
రాయలసీమ అంటే చిన్న చూపు చూడటం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి, ప్రజల ప్రాణాలు పోతుంటే... చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా సీఎం జగన్ వైఖరి ఉందని అఖిలప్రియ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని... ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు. ఎవ్వరూ కోరుకోని 3రాజధానుల నిర్ణయంతో అన్ని ప్రాంతాలకూ నష్టమేనని అభిప్రాయపడ్డారు.