ఉద్యోగాల కల్పనలో యువతను, నిరుద్యోగులను మోసగించిన ముఖ్యమంత్రే తొలి ముద్దాయి అని మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. కేసులు, స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిన జగన్ శిక్షార్హుడని ఆయన పేర్కొన్నారు. తమ భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టిన నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్న ఆలపాటి ..వాటిని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, సీపీఎస్ రద్దు హామీలతో యువతను, ఉద్యోగులను సీఎం మోసగించారని మండిపడ్డారు.
ALAPATI RAJA: తొలి ముద్దాయి ముఖ్యమంత్రే.. - alapati Raja responds to the arrest of the unemployed
నిరుద్యోగుల్ని మోసగించిన జగనే తొలి ముద్దాయి అని ఆలపాటి రాజా ఆరోపించారు. నిరుద్యోగుల్ని జగన్ నమ్మించి మోసం చేశారన్న విమర్శించారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెడతారా? అని రాజా ప్రశ్నించారు.
![ALAPATI RAJA: తొలి ముద్దాయి ముఖ్యమంత్రే.. Former Minister Alapati Raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12527575-1017-12527575-1626860942279.jpg)
మాజీమంత్రి ఆలపాటి రాజా