ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

adityanath das:నెలకు రూ.2.50 లక్షల పారితోషికం - ఆదిత్యనాథ్ దాస్

కేబినెట్‌ మంత్రి హోదా... నెలకు రూ.2.50 లక్షల పారితోషికం... దిల్లీలో ఉచిత నివాస వసతి... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌కు వీటితో పాటు పలురకాల ఇతర ప్రయోజనాలూ వర్తిస్తాయి. ఈ మేరకు సెప్టెంబరు 25న జారీ చేసిన జీవో ఆదివారం వెలుగుచూసింది.

ఆదిత్యనాథ్ దాస్
ఆదిత్యనాథ్ దాస్

By

Published : Oct 4, 2021, 4:49 AM IST

దిల్లీలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పూర్వ సీఎస్‌ ఆతిత్యనాథ్‌ దాస్‌కు....పలు ప్రయోజనాలు కల్పిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్‌ మంత్రి హోదాతో పాటు నెలకు రెండున్నర లక్షల పారితోషికం, దిల్లీలో ఉచిత నివాసవసతి కల్పిస్తున్నట్లు ఆదేశాలు వెలువరించింది. వీటితో పాటు పలురకాల ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 25న జారీచేసిన జీవో ఆదివారం వెలుగుచూసింది. ఆయన సీఎస్‌ హోదాలో పొందిన టీఏ, డీఏలను ఇప్పుడూ చెల్లిస్తారు.

ఏపీలో ఆయన పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా పరిగణించి...ప్రోటోకాల్‌, మర్యాదలు పాటిస్తారు. ముఖ్య సలహాదారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దిల్లీలోని ఏపీ భవన్‌ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. వాహనం, ఒక ఓఎస్డీ, ఓ ప్రైవేటు కార్యదర్శి, ఓ పర్సనల్‌ అసిస్టెంట్‌, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను పేషీకి కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగం ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

కృష్ణా నదిలో యువకుల గల్లంతు

ABOUT THE AUTHOR

...view details