ETV Bharat / city
పార్టీ మార్పు పుకార్లపై..సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్ - Former CBI JD strong counter to party change rumeros
తాను జనసేన వీడేది లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఉదయం నుంచి పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ సమయం వృథా చేసుకోవద్దని, వరద బాధితులను ఆదుకోవాలంటూ సూచించారు.


పార్టీ మార్పు వార్తలపై సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్
By
Published : Aug 10, 2019, 5:51 PM IST
| Updated : Aug 10, 2019, 6:38 PM IST
పార్టీ మార్పు వార్తలపై సీబీఐ మాజీ జేడీ దిమ్మతిరిగే కౌంటర్ తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై జనసేన నాయకులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. ఉదయం నుంచి వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యం వేసిందంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేసేవాళ్లు ఏ కేటగిరికి చెందినవారో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. ఇదే సమయాన్ని వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. తన సేవలు పార్టీకి ఉపయోగపడతాయని పార్టీ అధినేత పవన్ భావించే వరకు జనసేనతోనే ఉంటానని స్పష్టం చేశారు. Last Updated : Aug 10, 2019, 6:38 PM IST