ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ జి.రోశయ్యకు కోర్టుధిక్కరణ కేసులో హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాలు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
నాగార్జున వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ రోశయ్యకు జైలుశిక్ష, జరిమానా
కోర్టుధిక్కరణ కేసులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ జి.రోశయ్యకు హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాలు సస్పెండ్ చేసింది.
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల అమలు కోసం పలుమార్లు అవకాశం కల్పించినా.. ఉద్దేశపూర్వకంగా అధికారులు అమలు చేయలేదన్నారు. కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై జాలి చూపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. పిటిషనర్ 2018లో కోర్టును ఆశ్రయించారు, ఇప్పుడు ఆయనకు 68 ఏళ్లని గుర్తుచేశారు. న్యాయం కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలను ఖరారు చేసేలా నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని కోరుతూ.. దూరవిద్య కేంద్రంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా సేవలందించిన విశ్రాంత ఉద్యోగి సుబ్బారావు 2018 హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు పట్టించుకోకపోవడంతో వర్సిటీ అప్పటి రిజిస్ట్రార్ జి.రోశయ్యపై.. సుబ్బారావు కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.
ఇదీ చదవండి:‘మే’లో సాధారణం.. వచ్చే పది రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు