ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్‌లో దారుణం జరిగింది. బాలుడిపై అడవి పంది దాడి చేసింది. అక్కడే ఉన్నవారు బాలుడిని రక్షించారు. కాని అప్పటికే అతనికి తీవ్రగాయలయ్యాయి. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

forest pig
తెలంగాణ: బాలుడిపై దాడి చేసిన అడవి పంది.. రక్షించిన స్థానికులు

By

Published : Mar 20, 2021, 9:17 AM IST

బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు

అడవిపంది దాడిలో బాలునికి తీవ్ర గాయాలైన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్‌లో జరిగింది. పొలానికి వెళ్తున్న గంగాధర్ అనే బాలుడిపై అడవిపంది దాడి చేసింది. బాలుడిని కిందపడేసి నోటితో గాయపరిచింది.

గమనించిన స్థానికులు అడవిపందిని రాళ్లతో కొట్టడంతో విడిచిపెట్టింది. గాయాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తరువాత అడవిపందిని కొట్టి చంపేశారు.

ఇదీ చదవండి:సమీకృత బస్టాండ్లపై ముందడుగు

ABOUT THE AUTHOR

...view details