ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Forest Officials Response to Etv Bharat Story : అడవితల్లి ఆక్రందనపై అధికారుల స్పందన.. చర్యలు షురూ - కలప స్మగ్లర్లపై అటవీ శాఖ చర్యలు

Forest Officials Response to Etv Bharat Story: తెలంగాణలో అటవీ సంపద విధ్వంసం చేస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈటీవీ భారత్​లో ప్రచురించిన 'చెట్టుకు గొడ్డలి పెట్టు.. అడవి తల్లికి గుండెకోత!' కథనానికి అధికారులు స్పందించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు చేపట్టారు.

forest-officials-responded-to-etv-bharat-story-and-took-actions-on-wood-smuggling
అడవితల్లి ఆక్రందనపై అధికారుల స్పందన.. చర్యలు షురూ

By

Published : Jan 3, 2022, 11:29 AM IST

Forest Officials Response to Etv Bharat Story : తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కలప స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదీతీరాల నుంచి విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల పోడుసాగు కోసం కూడా అడవిని నరికేస్తున్నారు. ఇలా అటవీ సంపదను విధ్వంసం చేస్తున్న తీరుపై ఈటీవీ భారత్​ ప్రచురించిన ' చెట్టుకు గొడ్డలి పెట్టు.. అడవి తల్లికి గుండెకోత!'కథనానికి అటవీ అధికారులు స్పందించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలను చేపట్టారు.

ఆకస్మిక తనిఖీలు..

Forest Officials Action on Wood Smuggling : నిర్మల్‌ పట్టణం, మండలం, సారంగాపూర్‌ మండలాల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఎఫ్‌ఆర్‌ఓ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటించారు. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వెళ్లి అక్కడ వినియోగిస్తున్న కలపను పరిశీలించారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం సిర్‌పల్లి, రాంసింగ్‌తండా, స్వర్ణ, కౌట్ల(బి), సారంగాపూర్‌, జామ్‌, ధని తదితర గ్రామాల్లో డిప్యూటీ రేంజర్‌ శ్రీదేవి ఆదివారం సిబ్బందితో కలిసి ఆకస్మిక పర్యటనలు చేశారు. ఆయా గ్రామాల్లోని నూతన ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన అనుమతులున్నాయా, వాటికనుగుణంగానే ఉపయోగిస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించారు. వడ్రంగుల పని ప్రదేశాలను, టింబర్‌ డిపోలు, గోదావరి తీరప్రాంతాలు, ఇతర అనుమానిత ప్రదేశాలను సోదా చేశారు. ప్రస్తుతానికి అక్రమంగా నిల్వ ఉంచిన, అనుమతి లేకుండా వినియోగిస్తున్న కలప లభించలేదని ఎఫ్‌ఆర్‌ఓ పేర్కొన్నారు.

అడవిని నరికిన పలువురి గుర్తింపు?

Wood Smuggling in Telangana : ఆదిలాబాద్‌ జిల్లాలోని సిరికొండ మండలంలోని వాయిపేట్‌ అడవిలో ఉట్నూరు ఎఫ్‌డీఓ ఇన్‌ఛార్జి బర్నోబా, కుమురం భీం జిల్లా విజిలెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఓ రమాదేవి ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. టేకుచెట్లను నరికి వేయడం, కొన్నింటిని నరికేందుకు గొడ్డలితో గాట్లు పెట్టిన దృశ్యాలను పరిశీలించారు. సిరిచెల్మ ఎఫ్‌ఆర్‌ఓ వాహబ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. అడవిని నరికిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి..:సత్య సాయిబాబా సన్నీధిలో సుప్రీంకోర్టు జడ్జి రామసుబ్రమణ్యన్

ABOUT THE AUTHOR

...view details