హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పర్యటిస్తున్నారు. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థను ఈ బృందం సందర్శించింది. కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. దేశంలో కరోనా టీకాల పురోగతిని ఈ విదేశీ ప్రతినిధుల బృందం తెలుసుకుంటుంది.
తెలంగాణ: భారత్ బయోటెక్‌ను సందర్శించిన విదేశీ రాయబారులు, హై కమిషనర్లు - BHARAT Biotech Chairman Speech
కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద గల జినోమ్‌వ్యాలీకి వెళ్లారు. రెండు బృందాలుగా వీరు పర్యటిస్తున్నారు. మొదటి బృందంలోని వారు భారత్ బయోటెక్ లిమిటెడ్‌ను సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. విదేశీ రాయబారులకు కొవాగ్జిన్ టీకా వివరాలను భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్లా వివరించారు.
రాయబారుల పర్యటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకుంటోంది. శామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీకి రాయబారుల బృందాలు వెళ్లాయి. భారత్ బయోటెక్‌ను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. రాయబారులకు కొవాగ్జిన్ వివరాలు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.
భారత్ బయోటెక్‌ను ఎందరో ప్రముఖులు సందర్శించారు. పది రోజుల క్రితం ప్రధాని మోదీ కూడా సందర్శించారు. టీకా రంగంలో భారత్ బయోటెక్ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. - కృష్ణ ఎల్లా,భారత్ బయోటెక్ ఛైర్మన్