మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైపోయి బలవన్మరణాలకు(forced deaths to Addiction of drugs in ap) పాల్పడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా గణనీయంగా పెరుగుతోంది. గతేడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మత్తుకు బానిసలైన 385 మంది ఆత్మహత్య(forced deaths in andhra pradesh) చేసుకున్నారు. 2019తో పోలిస్తే 2020లో వీరి ఆత్మహత్యలు 27 శాతం పెరిగాయి. ఈ లెక్కల్లో మహిళలూ ఉన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల పరంగా మద్యం తర్వాత ఎక్కువ మంది ఉపయోగించేది గంజాయే. కొందరు ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాల్ని వాడుతున్నారు. సరదాగా మొదలుపెట్టి ఆ తర్వాత వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఈ అలవాటు తీవ్రమయ్యే కొద్దీ.. వారి ప్రవర్తనలో రకరకాల మార్పులు వచ్చి.. చివరకు ఆత్మహత్మలకు దారితీస్తోంది. గతేడాది ఏపీలో 7,043 మంది బలవన్మరణాలకు పాల్పడగా.. వారిలో 385 మంది (5.46 శాతం) మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన వారే కావడం తీవ్రతకు అద్దం పడుతుంది.
Forced deaths due to Addiction to drugs: రాష్ట్రంలో మత్తుకు బానిసలై.. 385 మంది బలవన్మరణం - మత్తుకు బానిసలై.. 385 మంది బలవన్మరణం
Forced deaths due to Addiction to drugs: సాధారణంగా.. మత్తు పదార్థాల పరంగా మద్యం తర్వాత ఎక్కువ మంది ఉపయోగించేది గంజాయే. కొందరు ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాల్ని వాడుతున్నారు. సరదాగా మొదలుపెట్టి ఆ తర్వాత వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఆ అలవాటు తీవ్రమయ్యే కొద్దీ.. వారి ప్రవర్తనలో రకరకాల మార్పులు వచ్చి.. చివరకు ఆత్మహత్మలకు దారితీస్తోంది. గతేడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మత్తుకు బానిసలైన 385 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Forced deaths due to Addiction to drugs
ఐదు రెట్లు అధికం
- సాధారణ వ్యక్తులతో పోలిస్తే మత్తు పదార్థాలకు బానిసలైన(forced deaths to Addiction of drugs) వారిలో చనిపోవాలనుకునే ధోరణి ఐదు రెట్లు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. మద్యం, మాదకద్రవ్యాలను అధికంగా తీసుకోవటం వల్ల వీరు మానసికంగా దెబ్బతిని ఈ తరహా ఆలోచనలు చేస్తుంటారు.
- ప్రధానంగా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు.
- గత ఏడేళ్లలో రాష్ట్రంలో మొత్తం 42,567 ఆత్మహత్య కేసులు నమోదుకాగా, వారిలో 1,600 మంది (3.75 శాతం) మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలే.
- మత్తు వ్యసనపరుల్లో 2014లో 94 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020 నాటికి ఆ సంఖ్య 385కు పెరిగింది. దీన్ని బట్టి వాటి వినియోగం, పర్యవసానాలు ఎలా పెరుగుతున్నాయో అర్థమవుతుంది.
- వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్, అవగాహన కల్పించటం ద్వారా ఈ ధోరణి నుంచి బాధితుల్ని(counselling) బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా తదితర దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం- ఆత్మహత్యలు అంశంపై వివిధ సంస్థలు అధ్యయనాలు చేసి.. నియంత్రణ చర్యలను సిఫార్సు చేస్తుంటాయి. అలాంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలోనూ చేపట్టాలని విశ్రాంత పోలీసు అధికారి ఒకరు సూచించారు.