జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బందులున్న వారు తమను సంప్రదించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కోరింది. అవసరమైన వారికి ఉచితంగానే కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని తెలిపింది. అనారోగ్యం ఉంటే పరీక్షలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. వైద్య సలహాలకు టోల్ ఫ్రీ నం.104కు ఫోన్ చేయాలని సూచించింది. స్వీయ గృహ నిర్భంధం పాటిస్తే ప్రభుత్వ క్వారంటైన్ అవసరం ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
'జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలుంటే.. 104 కు కాల్ చేయండి'
జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు 104 నంబరుకు కాల్ చేసి వైద్య సలహాలు పొందాలని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది.
'జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బందులంటే 104 కాల్ చెయ్యండి'