ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవులు - ఆంధ్రప్రదేశ్​లో లాక్​డౌన్ ప్రభావం

రాష్ట్రంలో లాక్​డౌన్​ నిబంధన కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు, వలసకూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించిన కొందరు దాతలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటకుంటున్నారు.

food-vegetable-money-needs-distribution-to-poor-people-in-andhra-pradhesh
ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవులు

By

Published : May 8, 2020, 11:23 PM IST

శ్రీకాకుళం జిల్లాలో...

ఆమదాలవలసలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన అర్చకులకు సభాపతి తమ్మినేని సీతారాం ఒక్కొక్కరికి రూ.పదివేలు, ఇద్దరు ఆలయ గుమాస్తాలకు రూ.అయిదు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రణస్థలం మండలం సంచాం పంచాయతీ పరిధిలో వైకాపా నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కొందాములగాం గ్రామానికి చెందిన డి.నారాయణరావు కుటుంబసభ్యులు 600 కుటుంబాలకు సరకులు అందించారు. లావేరు మండలంలోని బొంతుపేట గ్రామంలో మాజీ ఎఫ్.ఏ.సీ.ఎస్ అధ్యక్షుడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు తమవంతు సాయంగా పాలకొండ ఎంపీడీఓ, అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ శ్రీ నివాస్​కు రూ.100,100 చెక్కును అందించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

నర్సాపురంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న రిక్షా కార్మికులకు... నర్సాపురం కాపుసంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దెందులూరులో పేదలకు స్థానిక వైకాపా నాయకులు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆశయంతో వీటిని అందిస్తున్నామని దాతలు తెలిపారు. అత్తిలి మండలంలోని తిరుపతిపురం, శివపురం గ్రామాల్లోని చేనేత కార్మికులకు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి కూరగాయలు పంపిణీ చేశారు.

కడప జిల్లాలో...

కమలాపురంలో 1991-92 బ్యాచ్​కు చెందిన పదోతరగతి పూర్వ విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్వీపర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు.

అనంతపురం జిల్లాలో...

కదిరిలో ఉపాధి కోల్పోయిన వాయిద్య కళాకారులకు, క్షురకులకు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న క్వారంటైన్ కేంద్రానికి కదిరి లాడ్జి నిర్వాహకులు పరుపులను అందజేశారు. వీటిని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు చాంద్ బాషా, స్థానిక తహసీల్దార్​ అందజేశారు. పెనుగొండ పరిసర గ్రామాల ప్రజలకు... ఏపీటీఎఫ్ పెనుకొండ జోన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

విశాఖ జిల్లాలో...

బాషా ఛారిటబుల్ ట్రస్ట్, సమాలోచన సంస్థ తరఫున హోమియో వైద్యులు డాక్టర్ శశిధర్ సహకారంతో కళాకారుల కుటుంబాలకు నిత్యావసర సరకులను అందిచారు. పాడేరులో విలేకరులకు బుక్కా భవాని అనే మహిళ బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో అత్యవసర సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. నలభై ఆరు రోజులుగా యాచకులకు, నిరాశ్రయులకు భోజనాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

చిత్తూరు జిల్లాలో...

కురబలకోట మండలం రామిగానిపల్లెలో చిన్నారులు లాస్య, చరితలు సీఎం సహాయనిధికి రూ.పదివేలు విరాళంగా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి ఈ మొత్తాన్ని అందించారు. గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లి, కలకడ మండలం కొత్తపల్లి, ఆరుమాడకలలో స్థానిక వైకాపా నాయకులు నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లాలో...

సంతమాగలూరు మండలం కొమ్మలపాడుకు చెందిన 'సుభాని' గ్రామంలోని ముస్లిం సోదరులకు కూరగాయలు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్​లు వాడుతూ లబ్ధిదారులు సరకులు అందుకున్నారు.

నెల్లూరు జిల్లాలో...

రూరల్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వేఫీడర్స్ రోడ్డు వద్ద నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. దాతల చేయూతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ జయరాజ్ తెలిపారు.

ఇదీచదవండి.

మద్యం షాపులు మూసేయాలని హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details