ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్లు క్రెడిట్ ప్లాన్‌గా నాబార్డ్ నిర్ధరణ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. రూ.1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధరణ అయ్యిందని వివరించారు. రూ.1.13 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యమన్న కన్నబాబు... కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు వేశాయని చెప్పారు. పనితీరు మార్చుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నామన్న కన్నబాబు... 4 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
'ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు' - AP Agriculture Department Latest News
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్లు క్రెడిట్ ప్లాన్‌గా నాబార్డ్ నిర్ధరణ చేసిందని వివరించారు. పనితీరు మార్చుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నామన్న కన్నబాబు... 4 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇచ్చామని గుర్తుచేశారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. రూ.2900 కోట్లతో ఈ పార్కుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని వివరించారు. రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరతో పాటు వాటికి విలువ దక్కాలన్నదే ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని కన్నబాబు వివరించారు. రూ.13 వేల కోట్లతో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ... 2021-22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదల