పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయసేకరణకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఈ నెల 20న సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి ఉప నదులైన శబరి, సీలేరు పరీవాహక ప్రాంతంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ముంపు ఏర్పడనుంది. ఆ ముంపు పరిష్కారానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. అక్కడ ముంపు ఏర్పడే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టవలసి ఉంది.
POLAVARAM: పోలవరం వివాదాలపై 20న భేటీ - పోలవరం ప్రాజెక్టు తాజా సమాచారం
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయసేకరణ జరపనున్నారు. ఇందుకు సంబంధించిన సంబంధించి కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఈ నెల 20న సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం పూర్తి కావడం లేదు. ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులకూ వర్తమానం అందించారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఈ అంశానికి సంబంధించి ఒక ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండీ..సాధారణ వ్యక్తులకు 6-8 నెలల మధ్య మూడో టీకా: డాక్టర్ శ్రీధర్ చిలిమూరి