చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు - flood
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది ఒడ్డునే ఆయన నివాసం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట ఏర్పాటు చేశారు.
అమరావతి కరకట్ట వైపున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటివద్ద రక్షణ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా నది ఒడ్డున్న ఉన్న చంద్రబాబు నివాసం వైపు వరద వచ్చే అవకాశం ఉన్నందునముందస్తుగా6వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఇవాళ తెల్లవారుజ ాము నుంచి వరద పెరుగుతున్నందున ఆయన నివాసంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సామగ్రిని పైఅంతస్తుకు తరలించినట్లు తెలిసింది. చంద్రబాబు వాహన శ్రేణిని మంగళగిరి ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీరిసార్ట్స్కు చేర్చినట్లు సమాాచారం. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారు. చేతి నరం బెణికినందున వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.