ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - ప్రకాశం బ్యారేజ్ తాజా వార్తలు

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలో భారీగా నీటిమట్టం పెరిగింది. దీనితో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Prakasam Barrage vijayawada
Prakasam Barrage vijayawada

By

Published : Sep 27, 2020, 10:35 AM IST

Updated : Sep 27, 2020, 1:30 PM IST

కృష్ణా నది ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. పులిచింతల నుంచి బ్యారేజీకి 5.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు పూర్తిగా తెరిచి 4.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతితో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరగుతున్న క్రమంలో వరద ప్రభావిత మండలాల అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎవరూ బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.

Last Updated : Sep 27, 2020, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details