ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టుల్లో జలసిరులు - కృష్ణా నదికి వరద ప్రవాహం

కృష్ణమ్మకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నినిమిది గేట్లు ఎత్తి 2.19 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.

flood flow to nagarjuna, srisailam projects
కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకున్న ప్రాజెక్టులు

By

Published : Aug 24, 2020, 11:36 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,88,230 క్యూసెక్కులున్నాయి. 8 గేట్లు ఎత్తి 2.19 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జలాశయ పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం నీటినిల్వ 208.28 టీఎంసీలుగా ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,54,486 క్యూసెక్కులున్నాయి. నాగార్జునసాగర్‌ ప్రస్తుత నీటి నిల్వ 305.56టీఎంసీలు ఉంది. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు.

సాగర్‌ 8 గేట్లు ఎత్తి 1,15,344 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఎడమ కాలువకు 5,500 క్యూసెక్కులు, సాగర్‌ కుడి కాలువకు 3,371 క్యూసెక్కులు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 28,461 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్పలు

ABOUT THE AUTHOR

...view details