శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత ఇన్‌ఫ్లో 4,31,115 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,00,301 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు కాగా... ప్రస్తుత నీటినిల్వ 212.4385 టీఎంసీలుగా నమోదైంది.
పులిచింతలకు తగ్గిన ప్రవాహం..14గేట్లు ఎత్తివేత
పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొంతమేర తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత ఇన్‌ఫ్లో 4.41 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 43.54 టీఎంసీలుగా నమోదైంది.
ఇదీ చదవండి:
అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు