ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు కొనసాగుతున్న వరద - శ్రీశైలం జలాశయం వార్తలు

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 871.60 అడుగులకు చేరింది.

Flood flow continues from upper catchment areas to Srisailam and Tungabhadra reservoirs.
శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు కొనసాగుతున్న వరద

By

Published : Aug 17, 2020, 9:28 AM IST

ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,56,152 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 61,077 క్యూసెక్కులుగా నమోదైంది. నీటిమట్టం 871.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 148.7050టీఎంసీలుగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7 టీఎంసీల నీరు జలాశయంలోకి చేరింది.

కర్ణాటకలో కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. 32వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ 98.5 టీఎంసీలగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తి 25 వేల క్యూసెక్కులను నీటి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరే అవకాశం ఉంది. వరదప్రవాహం పెరిగితే మరో 6 గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:తుంగభద్ర జలాశయం నుంచి నదిలోకి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details