ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి - కృష్ణా నదికి వరదలు

కృష్ణమ్మకు ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా ఉన్నాయి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

flood continues to  krishna river
కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

By

Published : Oct 15, 2020, 1:09 PM IST

కృష్ణా నది వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 61,240 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416 , ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో , 5,47,418 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.

వంశధార నదికి వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, 56,750 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉంది. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

ఇదీ చదవండి:విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం

ABOUT THE AUTHOR

...view details