శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,26,183 క్యూసెక్కులు... ఔట్‌ఫ్లో 3,76,432 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 10 గేట్లు ఎత్తి 3,11,790 క్యూసెక్కులు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.20 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 205.66టీఎంసీల మేర ఉంది.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - floods to krishna
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
srisailam project