ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెల్లవారుజామున 4 గంటలకే మీసేవల వద్ద క్యూలైన్లు - flood affected people waiting from morning 4 am

హైదరాబాద్​లో వరద బాధితులు సాయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీసేవల ముందు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా.. 4 గంటల నుంచే మీసేవా కేంద్రాల వద్ద వేచిచూస్తున్నారు.

flood-affected-people
flood-affected-people

By

Published : Nov 18, 2020, 10:30 AM IST

తెల్లవారుజామున 4 గంటలకే మీసేవల వద్ద క్యూలైన్లు

హైదరాబాద్​లో వరదల వల్ల నష్టపోయిన బాధితులు ప్రభుత్వ సాయం పొందేందుకు ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులుగా బాధితులు మీసేవల వద్ద భారీ క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.

మల్లాపూర్ డివిజన్​లో వరదసాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీసేవా కేంద్రాల ముందు తెల్లవారుజామున 4గంటల నుంచే బాధితులు క్యూ కట్టారు. చలిని సైతం లెక్క చేయకుండా.. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదీ చూడండి:రీచ్​ల నిర్వహణ, విక్రయాల బాధ్యత ప్రైవేటు సంస్థలకే అప్పగించే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details