Flipkart CEO Meet CM Jagan: సీఎం జగన్‌తో.. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని.. ఐటీ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సీఎం జగన్ కోరారు. రైతుల పంటలకు మంచి ధరలు రావడానికి దోహదపడాలని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో సానుకూలంగా స్పందించారు. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఉత్తమ సాంకేతికత అందించేందుకు కృషిచేస్తామని చెప్పారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న కల్యాణ్ కృష్ణమూర్తి.. హై ఎండ్ స్కిల్ వర్శిటీ ప్రాజెక్టులో భాగస్వాములవుతామని వెల్లడించారు.