ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్నేహం మోహంలో తల్లి... ప్రాణం పోగొట్టుకుంది చిట్టి తల్లి - మేడ్చల్ జిల్లా నేర వార్తలు

ఓ వివాహిత ఫేస్​బుక్ స్నేహం ఆమె కుమార్తె అయిన ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. తనను దూరం పెట్టిందన్న కోపంతో ఆమె స్నేహితుడు చిన్నారిని అత్యంత క్రూరంగా గొంతు కోసి చంపాడు. అనంతరం అతనూ గొంతు కోసుకున్నాడు.

five-years-old-girl-brutally-killed-in-medchal-district
five-years-old-girl-brutally-killed-in-medchal-district

By

Published : Jul 2, 2020, 4:25 PM IST

Updated : Jul 2, 2020, 7:08 PM IST

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి చంపాడు పాప తల్లి ఫేస్‌బుక్ స్నేహితుడు. మరో యువకుడిపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు.

ఫేస్​బుక్ స్నేహం... కర్కశత్వం

పోచారానికి చెందిన అనూష అనే మహిళకు మూడు నెలల క్రితం కరుణాకర్​ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే కరుణాకర్‌ ద్వారా అనూషకు మరో యువకుడు రమేశ్ పరిచయమయ్యాడు. కొద్దిరోజులుగా రమేశ్‌తో స్నేహంగా ఉంటూ కరుణాకర్‌ను దూరం పెట్టింది. దీని గురించి మాట్లాడేందుకు గురువారం కరుణాకర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే ఇంట్లో రమేశ్ ఉండటంతో కరుణాకర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

కరుణాకర్‌ను చూసి రమేశ్‌ను గదిలో దాచింది అనూష. గదిలో నుంచి బయటకు రావాలని రమేశ్‌ను కరుణాకర్ ఒత్తిడి చేశాడు. బయటకు రాకుంటే అనూష కుమార్తె చిన్నారి ఆద్యను చంపుతానని బెదిరించాడు. అయినా రమేశ్ బయటకు రాకపోవటంతో కర్కశంగా చిన్నారి ఆద్య గొంతు కోశాడు. పాప అరుపులతో బయటకు వచ్చిన రమేశ్​పై, అనూషపైనా కత్తితో దాడి చేశాడు. భయంతో రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు కరుణాకర్. స్థానికులు గమనించి చిన్నారి తల్లి అనూష, కరుణాకర్‌ను ఆస్పత్రికి తరలించారని పోలీసులు వెల్లడించారు.

చిన్నారి తండ్రి కల్యాణ్ యాదాద్రి జిల్లా ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతనికి ఈ సమాచారం ఇచ్చారు ఘట్‌కేసర్ పోలీసులు.

ఇవీ చూడండి: కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

Last Updated : Jul 2, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details