ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతికి ఐదేళ్లు... ఐకాస ప్రత్యేక కార్యాచరణ - Amaravathi farmers protest news

అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు రేపటితో ఐదేళ్లు నిండుతున్న సందర్భంగా... రాజధాని రైతులు, మహిళలు, కూలీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానిని అర్థిస్తూ అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు రాత్రి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు.

Five years completed for Amaravati Foundation
అమరావతికి ఐదేళ్లు... ఐకాస ప్రత్యేక కార్యాచరణ

By

Published : Oct 21, 2020, 11:04 PM IST

రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు రేపటితో ఐదేళ్లు నిండుతున్న సందర్భంగా... రాజధాని రైతులు, మహిళలు, కూలీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. మోదీ ప్రభుత్వం అమరావతిని కాపాడాలంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు రాజధాని రైతుల ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అమరావతి ప్రస్తుత దుస్థితిని కళ్లకు కడుతూ శంకుస్థాపన జరిగిన పుణ్యస్థలి వద్ద రాజధాని అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో నిరసన తెలపనున్నారు.

అమరావతిని కాపాడాలంటూ కేంద్రాన్ని అర్థిస్తూ రైతులు, మహిళల వేడుకోలు నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి, మందడం, గుంటూరు నుంచి పుణ్యస్థలికి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉద్ధండరాయునిపాలెంలో సర్వమత ప్రార్ధనల తర్వాత... ప్రధానిని అర్థిస్తూ అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు రాత్రి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐకాస పిలుపునిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details