తెలంగాణలోని సిరిసిల్ల(Sircilla news) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు(students) గల్లంతయ్యారు. జిల్లా కేంద్రం శివారులోని మానేరు చెక్‌డ్యామ్‌లో ( Manair check dam)కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో రాజీవ్‌నగర్‌కు చెందిన గణేశ్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సిరిసిల్ల జిల్లాకేంద్రం వెంకంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు.
Missing in Manair Dam: మానేరు చెక్‌డ్యామ్‌లో ఐదుగురు గల్లంతు - మానేరు చెక్‌డ్యామ్‌లో ఐదుగురు గల్లంతు
19:55 November 15
ఒకరి మృతదేహం లభ్యం, మరో నలుగురి కోసం గాలింపు
గల్లంతైన వెంకటసాయి, అజయ్, క్రాంతి, రాకేశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సహాయ చర్యలకు ఆంటంకం ఏర్పడుతోంది. తాళ్ల సాయంతో మృతదేహాలను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మానేరు చెక్‌డ్యామ్‌లో ఈత కొట్టేందుకు మొత్తం 8 మంది విద్యార్థులు వెళ్లినట్లు స్థానికులు చెబుుతున్నారు.
ఇదీ చదవండి
Municipal Polls: ఉద్రిక్తతల మధ్య ముగిసిన 'కుప్పం' ఎన్నికల పోలింగ్