Palamuru lift: కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా పంప్‌హౌస్‌లోకి క్రేన్ దింపుతుండగా.. ఒక్కసారిగా తీగలు తెగిపడి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారనే సమాచారం తెలియాల్సి ఉంది.
PALAMURU LIFT ACCIDENT: పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం - నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలమూరు లిఫ్ట్ పనులు
Palamuru lift: కృష్ణానదిపై ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మిస్తోన్న తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌లోకి క్రేన్ దించుతుండగా ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. క్రేన్ వైరు తెగిపడటం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు చెబుతున్నారు.
ఐదుగురు కూలీలు దుర్మరణం
ప్రమాదంలో మరణించిన వారంతా బిహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందారన్న సమాచారాన్ని పోలీసులు గానీ, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు గానీ ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇవీ చూడండి..