ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యంత అరుదు.. 5 కిలోల బరువుతో పాప జననం - 5 kgs baby girl born in khammam hospital

తెలంగాణ ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది.

ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం
ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం

By

Published : May 10, 2020, 2:36 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపకు పురుడు పోశారు.

5 కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details