గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,495 నమూనాలను పరీక్షించగా.. 510 మందికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. చిత్తూరులో అత్యధికంగా 89, శ్రీకాకుళంలో అత్యల్పంగా 12 మందికి వైరస్ నిర్ధారణ జరిగిందని వెల్లడించింది. కృష్ణాలో 82, గుంటూరులో 74, పశ్చిమ గోదావరిలో 60, తూర్పు గోదావరిలో 47, ప్రకాశంలో 34, కర్నూలులో 22, కడపలో 21, విశాఖపట్నంలో 18, అనంతపురం, నెల్లూరు, విజయనగరంలలో 17 చొప్పున బాధితులు వెలుగు చూసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మహమ్మారి బారి నుంచి 665 మంది కోలుకోగా.. గుంటూరు, కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరి చొప్పున మరణించారని తెలిపింది.
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 1,07,67,117 కొవిడ్ నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,75,025 మందికి వైరస్ సోకింది. 8,62,895 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. మరో 5,078 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల 7,052 మంది మరణించారు.