ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bar license: దరఖాస్తుదారులు ఎందుకు వెనక్కి తగ్గారు? - బార్​ లైసెన్సు దరఖాస్తులు వెనక్కి

Bar license: బార్ల లైసెన్సుల దరఖాస్తుదారుల్లో 514 మంది వెనకడుగు వేశారు. క్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తొలుత 1,672 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన గడువు ముగిసే నాటికి 514 మంది వెనక్కి తగ్గారు. ఒత్తిళ్లే దీనికి కారణమని మద్యం వ్యాపారుల్లో చర్చ సాగుతోంది.

bar licence
బార్ల లైసెన్సుల దరఖాస్తు

By

Published : Jul 30, 2022, 7:30 AM IST

Bar license: రాష్ట్రంలో కొత్త బార్ల లైసెన్సుల కోసం తొలుత దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు, పర్యాటక ప్రాంతాల్లో కలిపి మొత్తం 838 కొత్త బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తొలుత 1,672 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన గడువు ముగిసే నాటికి వీరిలో 1,158 మంది మాత్రమే రుసుము చెల్లించగా.. 514 మంది వెనక్కి తగ్గారు.

వీరు వెనకడుగు వేయడానికి ఒత్తిళ్లే కారణమనే చర్చ మద్యం వ్యాపారుల్లో జరుగుతోంది. పలుచోట్ల తమకు పోటీ లేకుండా చూసేందుకు, వ్యాపారాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు.. కొందరు ఒత్తిళ్లు తీసుకొచ్చారని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారంతా ఫీజులు చెల్లించకపోవడంతో.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో కొంత గండిపడింది. 1,672 మంది వివరాలు నమోదు చేసుకున్నపుడు రూ.100 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనావేశారు. కానీ చివరకు రూ.91కోట్లే వచ్చింది. బార్లకు శని, ఆదివారాల్లో ఈ-వేలం నిర్వహించనున్నారు.

* ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ-వేలం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అవసరమైతే రీ-బిడ్డింగ్‌, లాటరీ ప్రక్రియ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.

* ఈ-వేలంలో బార్ల లైసెన్సులు దక్కించుకున్నవారి పేర్లను కలెక్టర్‌ అదే రోజు ఖరారుచేసి, వేలం ఖరారు పత్రం అందజేయనున్నారు. వీళ్లు అప్‌సెట్‌ విలువ, బిడ్‌ మొత్తానికి బ్యాంకు చలానా రూపంలో జమచేయాల్సి ఉంటుందని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details