తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం శివారులో జనం చేపల(FISH) కోసం ఎగబడ్డారు. నిషేధిత క్యాట్ ఫిష్‌తో(catfish) నార్కట్‌పల్లి నుంచి కర్ణాటక బీదర్ వెళ్తున్న బోలెరో వాహనం అంకిరెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
FISHES: చేపల లోడ్ వ్యాన్ బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన జనం - అంకిరెడ్డిగూడెం వద్ద చేపలలోడ్ వ్యాను బోల్తా
చేపల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అందులోని చేపలన్నీ.. కిందపడిపోయాయి. స్థానికులు, వాహనదారులు.. అందినకాడికి చేపల్ని సంచుల్లో పట్టుకెళ్లారు.
చేపల లోడ్ వ్యాన్ బోల్తా
వెంటనే అందులోని చేపలు రహదారి పక్కనే పడిపోయాయి. విషయం గమనించిన వాహనదారులు చేపల కోసం ఎగబడ్డారు. క్యాట్‌ఫిష్ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అందినకాడికి పట్టుకుపోయారు.