ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చేపల వ్యాపారి రమేష్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు - fish dealer ramesh murder case latest

తెలంగాణలోని హైదరాబాద్​లో కలకలం రేపిన చేపల వ్యాపారి రమేశ్​ హత్య కేసును వెస్ట్​ జోన్​ పోలీసులు ఛేదించారు. నిందితుడు రాజు నాయక్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

రమేష్‌ హత్య కేసు
రమేష్‌ హత్య కేసు

By

Published : Feb 7, 2020, 2:31 PM IST

చేపల వ్యాపారి రమేష్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు

తెలంగాణలోని హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో తీవ్ర కలకలం రేపిన చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. నిందితుడు రాజును అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. డబ్బుల కోసమే రాజు.. రమేశ్​ను హత్య చేసినట్లుగా గుర్తించారు.

అసలేం జరిగిందంటే..?
గతంలో రమేశ్​ నివాసంలో రాజు అద్దెకి ఉండేవాడు. పాత పరిచయంతో వ్యాపారి వద్ద డబ్బులు కాజేయాలని నిందితుడు ప్రణాళిక వేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. యువతిని ఎరగా చూపి.. రమేశ్​ను తన ఇంటికి తీసుకొచ్చి అతని ఒంటిపై బంగారాన్ని దోచుకెళ్లారని చెప్పారు. అనంతరం అతన్ని సుత్తితో కొట్టి చంపేశారన్నారు. రెండ్రోజుల తర్వాత అతని మృతదేహాన్ని మూటలో కట్టి పడేయాలని భావించారు. దుర్వాసన వస్తుండటం వల్ల అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రమేశ్​కు వచ్చిన కాల్ డేటా, సీసీ కెమెరాల ఆధారంగా రమేశ్ హత్య కేసును ఛేదించినట్లు డీసీపీ వెల్లడించారు.

ఇదీ చూడండి:వారితో వేడుక చేసుకున్న ట్రంప్!

ABOUT THE AUTHOR

...view details