భారీ వర్షాలకు ఓ ఇల్లు చేపలతో నిండిపోయింది. అవి చిన్న చేపలు అనుకుంటే పొరపాటే అవుతుంది. వాటిని చూస్తేనే.. ఔరా అనక తప్పదు మరి. గ్యాస్కట్, బొచ్చ చేపలు ప్రవాహంతో పాటు ఇంట్లోకి దూరి.. బందీలుగా మారిపోయాయి.
చేపలే ఇంటికి అతిథిగా వస్తే...
ఇంటి నిండా చేపలు ఉంటే ఎలా ఉంటుంది.. అది కూడా పెద్ద చేపలు అయితే ఇంకెలా ఉంటుంది.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం దానికదే కదులుతూ ఉంటే ఎలా ఉంటుంది.. అది వేటినో కంట్రోల్ చేయడానికి వెళ్తున్నట్టు అనిపిస్తే మరెలా ఉంటుంది.. వింతవింతగా ఉందా? అవును మరి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు .. భారీ వింతల్నే చూపిస్తున్నాయి. మరి వాటిని చూసేద్దామా!
చేపలే ఇంటికి అతిథిగా వస్తే...
భారీ వర్షాలు ప్రజలకు విసుగును తెప్పిస్తున్నాయి అనడంలో సందేహమేమీ లేదు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం వరదలో కొట్టుకుపోతూ.. వరద ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ సంఘటన వీక్షకులకు ఆనందాన్ని పంచుతూ.. కనువిందు చేస్తోంది.
ఇదీ చూడండి:వరుణుడి ప్రతాపం... కృష్ణా జిల్లా అతలాకుతలం