హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి.. తన సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై(భాజపా) 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్: తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి - Hyderabad-Rangareddy-Mahabubnagar Graduate MLC
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి.. తన సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై(భాజపా) 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
![హైదరాబాద్: తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి first priority vote counting completed in hyderabad ranga reddy mahabubabad graduate consistency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11068397-973-11068397-1616125635199.jpg)
సురభి వాణీదేవి
ఏడు రౌండ్లు పూర్తయినా.. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాని నేపథ్యంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానుంది. మూడో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడో రౌండ్ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
క్రమ సంఖ్య | అభ్యర్థులు | ఓట్లు |
1 | వాణీదేవి | 1,12,689 |
2 | రాంచందర్‌రావు | 1,04,668 |
3 | ప్రొ.నాగేశ్వర్ | 53,610 |
4 | చిన్నారెడ్డి | 31,554 |
5 | ఎల్.రమణ | 5,973 |
ఇదీ చూడండి.'కౌలు రైతులకు అండగా నిలబడేలా బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం'
TAGGED:
పట్టభద్రుల ఎన్నికల వార్తలు