ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: 'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు - 'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు

తెలంగాణలో తొలిరోజు నామినేషన్ల సందడి నెలకొంది. నగర, పురపాలికల పరిధిలో మొదటి రోజే పలు పార్టీల అభ్యర్థులు 967 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు
'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు

By

Published : Jan 9, 2020, 10:52 AM IST

తెలంగాణ: 'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు

తెలంగాణలో.. పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలిరోజు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 967 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 117 దాఖలు కాగా.. 94 నామినేషన్లతో పెద్దపల్లి తరువాతి స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 84, జగిత్యాల జిల్లాలో 71 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర, పార్టీల అభ్యర్థులు వార్డులకు నామినేషన్లు వేశారు. శుక్రవారం వరకు ఇందుకు అవకాశం ఉంది.

వివిధ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను గురువారం ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మెదక్​ పురపాలక సంఘంలో ఓ వార్డుకు సంబంధించి తన భార్యకు కాకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన ఇంకొకరికి టికెట్​ కేటాయించడంతో మనస్తాపానికి గురైన గోదల కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

సెల్​ఫోన్​ లైట్​లోనే..

జనగామ మున్సిపాలిటీ కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉండటం, జనరేటర్​ లేకపోవడంతో గదులు చీకటిమయమయ్యాయి. కొందరు అభ్యర్థులు సెల్​ఫోన్​ లైట్ల వెలుతురులోనే నామినేషన్​ పత్రాలు సమర్పించాల్సి వచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details