ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చికాగోలో హైదరాబాదీపై కాల్పులు... బాధితుడు క్షేమం - హైదరాబాదీపై కాల్పులు...

అమెరికాలోని చికాగోలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్న ఓ హైదరాబాదీపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జరిగిన ఈ కాల్పుల్లో బాధితుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై చికాగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చికాగోలో హైదరాబాదీపై కాల్పులు... బాధితుడు సురక్షితం
చికాగోలో హైదరాబాదీపై కాల్పులు... బాధితుడు సురక్షితం

By

Published : Dec 19, 2020, 8:16 AM IST

హైదరాబాద్​కు చెందిన సిరాజ్ కారుపై అమెరికాలోని చికాగోలో దుండగులు కాల్పులు జరిపారు. దాడిలో సిరాజ్ తృటిలో తప్పించుకున్నాడు. పాతబస్తీ చంచల్​గూడ ప్రాంతానికి చెందిన సిరాజ్ సయ్యద్ చికాగోలో మూడేళ్లుగా ఉబర్ క్యాబ్ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న తెల్లవారుజామున 4:00 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుడగా... నార్త్ డెవాన్ వద్దకు రాగానే రెండు కార్లలో వచ్చిన దుండగలు అతని కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.

దుండగుల దాడిలో సిరాజ్ సురక్షితంగా బయటపడ్డాడు. దాడి నుంచి తేరుకున్న బాధితుడు... చికాగో పోలీసులకు సమాచారం అందించాడు. కేసులో చికాగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనటపై స్పందించిన ఎంబీటి నేత అమ్జద్ ఉల్లా ఖాన్... ఈ విషయాన్ని విదేశాంగ మంత్రితో పాటు యుఎస్ఎలోని భారత రాయబారి, కాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఓ ప్రేమ కథ... మూడు ప్రాణాలు... ఎన్నో మలుపులు!

ABOUT THE AUTHOR

...view details