ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు మృతి

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది.

mavoist died at kothagudem
భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి

By

Published : Sep 3, 2020, 1:13 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా.. ఓ మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు.

కొద్దికాలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం పెరిగింది. అప్పటినంచి గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవుల్లో గాలింపు జరుపుతుండగా సమయంలో మావోయిస్టులు ఎదురుపడినట్లు సమచారం. అప్పుడే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details