హైదరాబాద్లోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉబర్ కారులో మంటలు చెలరేగాయి. ఇద్దరు ప్రయాణికులతో మలక్పేట్ నుంచి అమీర్పేట్ వెళ్తుండగా ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి దట్టమైన పొగలు, మంటలు వచ్చాయి.
ఉబర్ క్యాబ్లో మంటలు.. మంటలు ఆర్పే లోపే! - ఉబర్ క్యాబ్లో మంటలు
ఉబర్ క్యాబ్లో మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద జరిగింది.

ఉబర్ క్యాబ్లో మంటలు
ఉబర్ క్యాబ్లో మంటలు
అక్కడే ఉన్న సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు మొత్తం దగ్ధమైంది. ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఇద్దరు ప్రయాణికులను మరో వాహనంలో పంపేశారు.
ఇదీ చూడండి:ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్