శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న 30 మంది సిబ్బంది ఉన్నారు. సొరంగ మార్గం ద్వారా 15 మంది సిబ్బంది బయటపడ్డారు. జెన్‌కో ఆసుపత్రిలో డీఈ పవన్‌కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, డ్రైవర్ పాలంకయ్య, మాతృ, కృష్ణారెడ్డి, వెంకటయ్య చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. మంటలు అదుపులోకి వచ్చినా పొగలు దట్టంగా అలముకున్నాయి. పొగలు అలుముకోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.