ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరని నల్లమల కార్చిచ్చు.. పట్టించుకోని యంత్రాంగం - నాగర్​కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

నల్లమల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయింది. చెలరేగిన భారీ మంటలకు వృక్షాలు, మొక్కలు బూడిదయ్యాయి. అటవీ అధికారులు తక్షణం చర్యలు తీసుకోకుంటే పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం ఉంది.

fire accident in nallamala forest
ఆహుతైన నల్లమల అటవీ ప్రాంతం.. ఇంకా పట్టించుకోని అధికారులు

By

Published : Feb 4, 2020, 11:56 PM IST

ఆహుతైన నల్లమల అటవీ ప్రాంతం.. ఇంకా పట్టించుకోని అధికారులు

తెలంగాణలోని నాగర్​కర్నూల్​ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం దగ్ధమైంది. గత మూడు రోజులుగా నల్లమల అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజు రోజుకి అడవిలో ఉన్న విలువైన వృక్షాలు, మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇవాళ శ్రీశైలం వెళ్లే రహదారిలో వటవర్లపల్లి, దోమలపెంటకు మధ్య భారీ మంటలు వ్యాపించాయి. ఈ మంటలతో ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అటవీశాఖ తక్షణమే చర్యలు చేపట్టకపోతే అటవీ ప్రాంతం మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే సందర్శకులు ఎవరైనా విడిదిలో భాగంగా సిగరెట్ లేదా వంటలు చేసి మంటలు ఆర్పకుండా పోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వేసవికాలం రావడం వల్ల మరింత పటిష్ఠమైన చర్యలు అటవీశాఖ చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details