తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు 30 మందితో వెళ్తున్న సూపర్ లగ్జరీ(ఏసీ) బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనక ప్రాంతంలో మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్... వెంటనే ఆప్రమత్తమై బస్సును పక్కన ఆపేశాడు. హుటాహుటిన ప్రయాణికులందరినీ కిందికి దించేశాడు.
LIVE VIDEO: బస్సులో చెలరేగిన మంటలు... చూస్తుండగానే దగ్ధం - RTC bus catches fire in telnagana
తెలంగాణలో హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ(ఏసీ) బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్... వెంటనే ఆప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణీకులను హుటాహుటిన కిందికి దించేశాడు. అయితే బస్సు మాత్రం అందరూ చూస్తుండగానే ఖాళీపోయింది.
క్షణాల్లోనే మంటలు బస్సును ఆవహించాయి. దట్టమైన పొగలు కక్కుతూ... చూస్తూండగానే బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించేలోపే బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఇవీ చూడండి:
- YS Viveka murder case: వివేకా హత్యకేసు దర్యాప్తులో కీలక పరిణామం..!
- Attack on RTC driver: బస్సు ఆపలేదనే కోపంతో డ్రైవర్‌పై దాడి
- FIRE ACCIDENT: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు