ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గెలుపు సంబరాల్లో అపశృతి.. తెలంగాణ భవన్​లో అగ్ని ప్రమాదం - telangana Bhavan fire accident news

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపుతో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

తెలంగాణ భవన్​లో అగ్నిప్రమాదం
తెలంగాణ భవన్​లో అగ్నిప్రమాదం

By

Published : Mar 20, 2021, 10:01 PM IST

తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయంతో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిప్పురవ్వలు ఎగిరిపడి భవన్​ ప్రాంగణంలో ఉన్న ఎండిన చెట్లపై పడి మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details