తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా అగ్నిప్రమాదానికి దారితీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్ దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారమ్ యజమాని వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు - పిఠాపురంలో అగ్నిప్రమాదం
బాణసంచా తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్ దగ్ధమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో 1200కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
fire accident in pithapuram