టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంట్లో అగ్రిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసం ఉండే భవనంలోని 12వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రకుల్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Rakul preet singh:రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంట్లో అగ్నిప్రమాదం - rakul
టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆమె నివసిస్తోన్న భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంట్లో అగ్నిప్రమాదం
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం హిందీలో పలు సినిమాలతో బిజీగా ఉంది.
ఇదీ చదవండి: భారత నౌకా దళంలోకి 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'
TAGGED:
rakul