Fire accident in train: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు.
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు.. రైలులోని ప్రయాణికులంతా.. - దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం
Fire accident in train: సికింద్రాబాద్ నుంచి దిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. తక్షణం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలనార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రైలు చివరి బోగీలో దగ్ధమైన ప్యాకింగ్ చేసిన సరుకులు ఎక్కువగా అమెజాన్ ఆన్లైన్ షాపింగ్‌కి చెందినవని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎంత మొత్తంలో నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.
ఇవీ చూడండి: