ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

fire accident: ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం.. కమ్మేసిన దట్టమైన పొగ - సంగారెడ్డి నేర వార్తలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కాజిపల్లిలో అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఫార్మా పరిశ్రమ గోదాంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire accident in pharma company at telangana
ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం

By

Published : Aug 18, 2021, 10:13 PM IST

ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని లీ పరిశ్రమకు చెందిన రసాయన గోదాంలో ఈ ప్రమాదం (fire accident) జరిగింది. రసాయనాలు మండి అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు భారీగా పొగ అలుముకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమకు చెందిన అగ్నిమాపక యంత్రం, నీటి ట్యాంకర్లు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. గోదాం కావడంతో ఉద్యోగులు పరిమితంగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details