హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. జీఎస్‌ఎం లైఫ్‌సైన్స్ ఫార్మా పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
Fire accident: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం..కార్మికుల పరుగులు - telangana varthalu
కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీఎస్‌ఎన్ లైఫ్‌సైన్స్ ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం.
కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
పక్కనే ఉన్న ఇంటీరియర్ వస్తువుల దుకాణానికి మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: విషాదం: పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి