మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. గాలి ప్రవాహం తోడవడంతో మంటలు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. భారీగా చెట్లు తగలబడుతున్నాయి.
కార్చిచ్చు చెలరేగిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని... మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వెదురు చెట్లు ఉండటంతో... మంటలు అదుపులోకి రావడం లేదని సిబ్బంది తెలిపారు.