ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ అక్రమాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్​పై కేసు - ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు

జగన్​ అక్రమాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్​ అధికారి సీవీఎస్​కే శర్మపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. న్యాయసలహాల ఖర్చుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై తెలంగాణ పోలీసులు ఎఫ్​ఐఆర్​ దాఖలు చేశారు.

జగన్​ అక్రమాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్​పై కేసు

By

Published : Oct 31, 2019, 9:27 PM IST

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయ సలహాల ఖర్చుల పేరుతో... నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. తప్పుడు రశీదులు సృష్టించి బిల్లులు కాజేశారని.. ఈ వ్యవహారంలో సహకరించారని.. అప్పటి సీఎస్ పీకే మహంతి, ఏపీ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్​పై కూడా కేసు నమోదు చేశారు. జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రమణ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణలోని నాంపల్లి కోర్టు జారీ చేసిన ఆదేశాలతో సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

జగన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంలో న్యాయ సలహాకు నిధులు ఇవ్వాలని 2014లో కొందరు ఐఏఎస్ అధికారులు కోరడం వల్ల అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. అయితే సీవీఎస్కే శర్మ న్యాయవాదికి ఫీజు చెల్లించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వం నుంచి రూ. 7 లక్షల 56 వేలు కాజేశారని ఆరోపిస్తూ ఏవీ రమణ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంట్లో పీకే మహంతి, పీవీ రమేష్ ప్రమేయం కూడా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. సీవీఎస్ కే శర్మ, పీకే మహంతి, పీవీ రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఈనెల 28న ఆదేశించింది.

ఇవీ చూడండి: పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట...!

ABOUT THE AUTHOR

...view details