సభ్యత్వం తీసుకుంటే ఫిట్‌నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ ఫూల్, హాలిడే ట్రావెల్ ప్యాకేజీలు తదితర సేవలు అందుకునే అవకాశం ఉంటుందని నమ్మబలికారు కంట్రీక్లబ్ ప్రతినిధులు.. వారి ఒత్తిడి మేరకు హైదరాబాద్ లోని ఉప్పల్‌కు చెందిన వై.వెంకట శ్రీనివాసరెడ్డి సభ్యత్వం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.56 వేలు చెల్లించారు.
ఫిట్‌నెస్ సెంటర్ హబ్సిగూడలో ఉందని చెప్పడంతో చూడటానికి వెళ్లిన శ్రీనివాస్ అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. పూర్తిగా పాడయిపోయి శిథిలావస్థలో ఉండటంతో తన సభ్యత్వాన్ని రద్దు చేసి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మెయిల్ ద్వారా కంట్రీక్లబ్ వారిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి లేఖ ద్వారా అభ్యర్థించారు.